Sat. Apr 20th, 2024
Continuation of a series of 8 lakh examinations per day, India conducts over 3.5 crore examinations, an increase in the number of examinations per million; Today that number is 25,574

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,23 ఆగష్టు 2020 : 2020 జనవరిలో పూణే లో ఉన్న ప్రయోగశాలలో కేవలం ఒకే ఒక కోవిడ్ పరీక్షతో ప్రారంభమైన ప్రస్థానం, నేడు భారతదేశంలో సంచిత పరీక్షల సంఖ్య 3.5 కోట్లను దాటింది. గత 6 రోజుల్లోనూ స్థిరంగా రోజుకు 8 లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 8,01,147 మందికి పరీక్షిస్తే, ఇప్పటి వరకు మొత్తం దేశవ్యాప్తంగా కోవిడ్ పరీక్షల సంఖ్యా 3,52,92,220 కి చేరుకుంది. దృష్టిని ఒకే లక్ష్యంపై కేంద్రీకరిస్తుం శ్రేణీకృత్ ఆలోచనతో కేంద్రం ఉధృతమైన పరీక్షల వ్యూహంతో అనుసరించిన విధానమే పరీక్షల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణమైంది.

Continuation of a series of 8 lakh examinations per day
Continuation of a series of 8 lakh examinations per day
Continuation of a series of 8 lakh examinations per day
Continuation of a series of 8 lakh examinations per day

రోజువారీ వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడం, పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉండడం జరుగుతోంది. పరీక్ష, ఛేదన, చికిత్స విధానాన్నే మంత్రంగా తీసుకున్న ప్రభుత్వం మిలియన్ మందిలో పరీక్షల నిర్వహణ సంఖ్య 25,574 మందికి పెరిగింది. ఉధృతంగా చేపట్టే పరీక్ష ద్వారా మాత్రమే పాజిటివ్ కేసులను గుర్తించవచ్చు, వారి ఆచూకీని సకాలంలో ట్రాక్ చేసి వెంటనే వారిని ఐసొలేషన్ కి పంపడం జరుగుతోంది. అలాగే తీవ్రమైన, క్లిష్టమైన రోగులకు అవసరమైన క్లినికల్ చికిత్సను అందించారు. టెస్టింగ్ వ్యూహం జాతీయ ప్రయోగశాల నెట్‌వర్క్ స్థిరమైన విస్తరణను కూడా నిర్ధారిస్తుంది. నేడు, ప్రభుత్వ రంగంలో 983 ల్యాబ్‌లు, 532 ప్రైవేట్ ల్యాబ్‌లతో, 1515 ల్యాబ్‌లు ప్రజలకు సమగ్ర పరీక్షా సదుపాయాలను కల్పిస్తున్నాయి. వీటితొ పాటు:
• రియల్ టైమ్ ఆర్టి పీసీఆర్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 780 (ప్రభుత్వం: 458 + ప్రైవేట్: 322)
• ట్రూనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 617 (ప్రభుత్వం: 491 + ప్రైవేట్: 126)’
• సీబీనాట్ ఆధారిత పరీక్ష ప్రయోగశాలలు: 118 (ప్రభుత్వం: 34 + ప్రైవేట్: 84)
కోవిడ్-19 సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలకు అన్ని ప్రామాణికమైన, నవీకరించిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా సందర్శించండి: https://www.mohfw.gov.in/, @ MoHFW_INDIA.
కోవిడ్-19 కి సంబంధించిన సాంకేతిక అంశాలకు … covid19@gov.in ,ncov2019@gov.in , @CovidIndiaSeva పై ఇతర ప్రశ్నలకు సమాధానం పొందవచ్చు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ). COVID-19 లోని స్టేట్స్ / యుటిల హెల్ప్‌లైన్ నంబర్లజాబితాhttps://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf వద్ద కూడా అందుబాటులో ఉంది.