Fri. Mar 29th, 2024
The Prime Minister will lay the foundation stone for AIIMS in Rajkot on the 31st of this month.

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,డిసెంబర్ 30,2020:ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని రాజ్‌కోట్ లో ఎఐఐఎమ్ఎస్ కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా  ఈ నెల 31 న ఉద‌యం 11 గంట‌ల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.  ఈ సంద‌ర్భం లో గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్‌, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, కేంద్ర ఆరోగ్య మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి కూడా పాల్గొంటారు.
ఈ ప్రాజెక్టు కోసం 201 ఎక‌రాల భూమిని కేటాయించ‌డ‌మైంది.  దీనిని 1195 కోట్ల రూపాయ‌ల అంచనా ఖ‌ర్చుతో నిర్మించ‌నున్నారు.  ఈ ప్రాజెక్టు 2022వ సంవ‌త్స‌రం మ‌ధ్య క‌ల్లా పూర్తి కాగ‌ల‌ద‌ని ఆశిస్తున్నారు.  అత్యాధునిక‌మైన 750 ప‌డ‌క‌లతో ఏర్పాట‌య్యే ఆసుపత్రిలో 30 ప‌డ‌క‌లతో కూడిన ఆయుష్ బ్లాకు కూడా ఉంటుంది.  ఈ ఎఐఐఎమ్ఎస్ లో 125 ఎమ్‌బిబిఎస్‌ సీట్లతోపాటు, 60 న‌ర్సింగ్ సీట్లు ఉంటాయి.

The Prime Minister will lay the foundation stone for AIIMS in Rajkot on the 31st of this month.
The Prime Minister will lay the foundation stone for AIIMS in Rajkot on the 31st of this month.