Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,మార్చి 21, 2022: కోకా-కోలా ఇండియా, తదుపరిగా తన బ్రాండ్ , వర్ణభరిత విభాగాన్ని మధురమైన పళ్ళ రుచి గల వేరియంటుతో విస్తరిస్తూ ఫాంటా, కొత్త రుచి అయిన యాపిల్ డిలైట్‌, ఆవిష్కరణను ప్రకటించింది. ఈ వేసవిలో, ఇండియాలోని వినియోగదారులు తమ మనస్సు, శరీరం,స్ఫూర్తిని తాజాగా ఉంచుకోవడానికి నిజమైన యాపిల్ పళ్ళరసముతో మెరిసే పానీయాన్ని ఆస్వాదించగలుగుతారు. ఇండియా, అభిమాన పళ్ళ రుచిగల బ్రాండు ఫాంటా , మరొక వినోద దాయిని, ఉత్సాహం ,శక్తిని పెంపొందించేలా రూపొందించిన తన కొత్త వర్ణభరిత వాణిజ్య ప్రకటనను కూడా దక్షిణాది చలనచిత్ర సూపర్ స్టార్, బ్రాండ్, కొత్త అంబాసిడర్ సమంతా రూత్ ప్రభుతో ఆవిష్కరించింది.

సమంతా రూత్ ప్రభు ఫాంటా యాపిల్ డిలైట్ ఆస్వాదిస్తున్నట్లుగా కొత్త వాణిజ్య ప్రకటనలో చూడవచ్చు, అది బ్రాండుతో ఆమె సహవాసము ,ప్రారంభాన్ని సూచిస్తుంది. వినియోగదారుల జీవితాలలో ఉల్లాసము ,ఉత్సాహాన్ని నింపడానికి ఫాంటా పర్యాయపదంగా ఉంటూ వస్తోంది, మరి యాపిల్ డిలైట్ తో, వారి ఆధునిక జీవితాలలో అనానుకూలతలు ఉన్నప్పటికీ కూడా వర్ణభరితంగా నిలవడానికి ఈ కొత్త క్యాంపెయిన్ ఒక సముదాయింపుగా పనిచేస్తుంది.

ఇండియా,తళతళలాడే విభాగములో పళ్ళ రుచి గల పానీయాలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. ఫాంటా ద్వారా ఈ రుచి , జోడింపు ఇండియాలోని బ్రాండ్ విభాగాన్ని ఒక రెండు-రుచుల శ్రేణికి పెంపొందిస్తుంది. ఈ పానీయం దేశవ్యాప్తంగా వివిధ రకాల ప్యాక్‌లుగా –250మి.లీ, 600 మి.లీ, 750 మి.లీ లలో లభిస్తుంది.

ఇండియాలో ఈ ఆవిష్కరణపై వ్యాఖ్యానిస్తూ, కోకా-కోలా ఇండియా ,సౌత్ వెస్ట్ ఆసియా స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ సీనియర్ డైరెక్టర్ టిష్ కాండెనో గారు ఇలా అన్నారు, “ ‘జీవితానికి పానీయాలు’ అనే మా దార్శనికతకు అనుగుణంగా, నేటి మా వినియోగదారుల ఉద్భవ రుచులు, ప్రాధాన్యతలపై దృష్టి సారిస్తూ, మేము యాపిల్ రుచి విభాగపు శ్రేణి లోనికి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాము. అంతే కాకుండా పైపెచ్చుగా, మా ఆవిష్కరణ ప్రాధాన్యతలు,విస్తృతమైన పరిశోధన, కొత్త ఫాంటా యాపిల్ డిలైట్ తో మేరిసే యాపిల్ కి తాజాదనపు ఊపును తీసుకురావడానికి మమ్మల్ని ముందుకు నడిపింది” అన్నారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ, “సమంతా ఆనందదాయకమైన రీతిలో బ్రాండుకు తన స్వంత అభిరుచి మరియు శక్తిని తీసుకువస్తుంది. మా ఇటీవలి తాజా వాణిజ్యప్రకటనలో ప్రకాశవంతమైన వేసవి దృశ్యాలు, సవాళ్ళతో కూడిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మా వినియోగదారులు సాధ్యమైనంత ఉల్లాసంగా నిలవాలని గుర్తు చేస్తాయి” అన్నారు.

ఫాంటా , నూతన ముఖతార సమంతా రూత్ ప్రభు, ఇలా అన్నారు, “అనేక దశాబ్దాలుగా ఫాంటా ఉల్లాసానికీ,ఉత్సాహానికీ పర్యాయపదంగా ఉంటూ వస్తోంది. ఫాంటా, కొత్త ఆవిష్కరణ, యాపిల్ రుచి, తాజాదనము ఉన్న ఫాంటా యాపిల్ డిలైట్ ద్వారా బ్రాండుతో సాహచర్యం పొందడం పట్ల నాకు అత్యంత ఆనందంగా ఉంది. ఈ ఆనందకరమైన క్యాంపెయిన్ ద్వారా, జీవితాన్ని మరీ సీరియస్ గా తీసుకోవద్దనీ, కుటుంబం,మిత్రులతో ఆనంద క్షణాలు గడపాల్సిందనీ నేను నా ప్రేక్షకులకు తెలియజేయాలనుకుంటున్నాను. కేవలం కొత్త ఫాంటా యాపిల్ డిలైట్ చప్పరించండి, ఈ వేసవిలో సంతోషంగా ,వర్ణభరితంగా నిలవండి.”

కొత్త ఉత్పాదన వేరియంటుతో ప్రేక్షకులకు సుపరిచితం చేయడానికి గాను 2022, మార్చి 18 నుండి ఇండియా లోని టీవీ ఛానళ్ళ వ్యాప్తంగా ప్రసారం కాబోతున్న ఈ కొత్త ఫాంటా వ్యాపార ప్రకటన చాలా విశిష్టంగా ఇతివృత్తీకరణ చేయబడింది. ఇది, డిజిటల్,ఓఓహెచ్ ప్రయత్నాలు రెండూ కలిగి ఉండే ఒక ఘనమైన 360-డిగ్రీ మార్కెటింగ్ విధానంతో ప్రోత్ర్సహించబడుతుంది.

“ఫాంటా అనేది అంతా వర్ణభరిత వ్యక్తుల కోసం. మరి ఈ కొత్త ఫాంటా యాపిల్ డిలైట్ అనేది రోజువారీ పరిస్థితుల్ని మరిన్ని తమాషాల లోనికి మార్చుకోవడానికి వ్యక్తులకు మరి కొంత ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇది ఒక మలుపునిచ్చే పానీయం. మీరు కేవలం దీన్ని చప్పరించరు, ఐతే మీరు వాస్తవంగా దీని బైట్ తీసుకుంటారు ఎందుకంటే ఇందులో నిజమైన యాపిల్ జ్యూస్ ఉంది. యాపిల్ కొరికిన శబ్దం,సులువైన వాడకం సజీవంగా యాపిల్ రుచిని తీసుకురావడమే గాకుండా, ప్రపంచానికి కొంత ఉత్సాహాన్ని కూడా జోడిస్తుంది. అద్భుతమైన, శక్తివంతమైన,వర్ణభరితమైన నటీమణి సమంతా రూత్ ప్రభుచే ఇక్కడికి సజీవంగా తీసుకురాబడింది.” – రీతూ శారద, ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఓజిల్వీ ఇండియా (నార్త్).

ఈ వేసవి తొలి రోజుల్లోనే ఇండియా లోని మార్కెట్ల వ్యాప్తంగా షెల్ఫులపై ఈ కొత్త వేరియంట్ అందుబాటులో ఉంటుంది,దేశవ్యాప్తంగా సగం మిలియన్ కంటే ఎక్కువ ఔట్‌లెట్లలో చిల్లరగా విక్రయించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా, అనేక మార్కెట్ల వ్యాప్తంగా యాపిల్ వేరియంట్లలో ఫాంటా లభిస్తుంది,ఇప్పుడు ఇండియాలో ఫాంటా యాపిల్ డిలైట్ తో లభిస్తుంది.

ఆరంజ్ విభాగములో ఫాంటా మార్కెట్ వాటా అగ్రగామిగా ఉంది, ఈ వేరియంటుతో మొత్తం పళ్ళ-రుచి విభాగములో తనకు తానుగా వృద్ధి కావాలని బ్రాండు లక్ష్యంగా చేసుకొంది. అధిక ప్రభావం కలిగించే విక్రయదాయినిగా ఆశించబడుతున్న ఈ కొత్త రుచి, దేశంలో మృదు-పానీయాల విభాగములో కోకా-కోలా స్థానాన్ని మరింతగా బలోపేతం చేస్తుంది.