Sat. Apr 20th, 2024
Lincoln Pharmaceuticals Ltd launches Vitamin C + Zinc Tablets to boost immunity in the fight against COVID 19

365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్ జూలై 1,2020: అందరికీ ఆరోగ్యం అందించాలనే తమ నిబద్ధత దిశగా, భారతదేశంలో సుప్రసిద్ధ హెల్త్‌కేర్ కంపెనీలలో ఒకటైన లింకోల్న్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇప్పుడు నమిలే విటమిన్ సీ + జింక్ ట్యాబ్లెట్లను భారతదేశ మార్కెట్‌లో విడుదల చేసింది. జింక్ కలయికతో సహజసిద్ధమైన రోగనిరోధక శక్తి కోసం నిరూపితాధారిత బయో -యాక్టివ్‌గా యాంటీ వైరల్ యాక్టివిటీని ఈ టాబ్లెట్ పెంచడంతో పాటుగా కోవిడ్-19 నుంచి రక్షణను సైతం అందిస్తుంది. భారతదేశంలో విటమిన్ సీ ,జింక్ ట్యాబ్లెట్ల మార్కెట్ 150 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. ఇది ప్రతి ఏటా 15%వృద్ధి నమోదుచేస్తుంది.అశీష్ ఆర్ పటేల్, హోల్ టైమ్ డైరెక్టర్, లింకోల్న్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మాట్లాడుతూ “ఈ కోవిడ్-19 మహమ్మారి వేళ, రోగ నిరోధక శక్తి,రోగ నిరోధక శక్తి బూస్టర్లు మాత్రమే వైరస్ నుంచి కాపాడగలవు. తమ రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరికీ విటమిన్ సీ,జింక్ ట్యాబ్లెట్లు అతి ముఖ్యమైన అవసరాలుగా నిలుస్తున్నాయి. చూయింగ్ టాబ్లెట్ రూపంలో ఉండటంతో చేత ఎవరైనా వీటిని వాడవచ్చు. కోవిడ్-19తో పోరాటానికి కంపెనీ కట్టుబడి ఉంది,ప్రభుత్వాలు, సంబంధిత వాటాదారులతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా మందులను అవాంతరాలు లేకుండా సరఫరా చేయనున్నాం” అని అన్నారు.

Lincoln Pharmaceuticals Ltd launches Vitamin C + Zinc Tablets to boost immunity in the fight against COVID 19
Lincoln Pharmaceuticals Ltd launches Vitamin C + Zinc Tablets to boost immunity in the fight against COVID 19

ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో అగ్రశ్రేణి కంపెనీలో ఒకటి లింకోల్న్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. క్యాప్సూల్స్, ట్యాబ్లెట్లు, డ్రై సిరప్, లిక్విడ్ వయెల్స్, ఇంజెక్టబుల్స్, ఆయిన్‌మెంట్స్ మొదలైనవి తయారుచేస్తుంది.
ఈ కంపెనీ 600 పైగా ఫార్ములేషన్స్‌ను 15 థెరపాటిక్ విభాగాలలో అభివృద్ధి చేయడంతో పాటుగా యాంటీ ఇన్‌ఫెక్టివ్, రెస్పిరేటరీ వ్యవస్థ, గైనకాలజీ, కార్డియో, సీఎస్ఎస్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ-డయాబెటిక్, యాంటీ మలేరియా మొదలైన వాటిలో ఉత్పత్తులను కలిగి ఉంది. దేశీయ మార్కెట్‌లో బలీయంగా ఉనికి చాటడంతో పాటుగా 60కు పైగా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.