Thu. Apr 25th, 2024

2020 ఈజిప్టియన్ నైట్

ఆదిత్య పార్క్ నిర్వహించనున నూతన సంవత్సరాది వేడుకలు

2020 నూతన సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకలను సరికొత్తగా ఈజిప్షియన్ థీమ్ తో 2020 ఈజిప్టియన్ నైట్ పేరుతో 31 డిసెంబర్ 2019 నాడు రాత్రి 8.30 గంటల నుండి హోటల్ లో నిర్వహిస్తున్నది.  దంపతులకు రూ. 5999 లకు, ఒక్కరికి రూ. 3999 లకు మరియు పిల్లలకు రూ. 999 రూపాయల రుసుముతో ఈజిప్షియన్ థీమ్ తో నిర్వహించనున్న ఈ నూతన సంవత్సర కార్నివాల్ లో ఘనమైన డిన్నర్ తో పాటూ బేవరేజస్, గిఫ్ట్స్ మరియు డిజె శాండి మరియు డిజె అయోధ్య ద్వారా వినిపించబడే ప్రత్యేకమైన మ్యూజిక్ ల వంటివెన్నో భాగంగా ఉంటాయి. కార్నివాల్ లో ఆడి, పాడడంతో పాటూ తన్మయత్వం పొందేలా రూపొందించబడిన కార్యక్రమాలతో నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పేలా తీర్చిదిద్దబడింది. అర్థరాత్రి 00.00 గంటల వరకూ లిమిట్ లేకుండా ఆల్కహాల్ కు తోడూ ఎటువంటి పరిమితులు లేకుండా స్టార్టర్లతో పాటూ అవధులు లేని బఫెట్ ఈ రాత్రి ప్యాకేజీలో బాగంగా ఉంటాయి.  ఇక కార్యక్రమానికి వచ్చే చిన్నారుల కోసం ప్రత్యేకమైన కిడ్ జోన్ ను రూపొందించి అందులో ఎన్నో ఇండోర్ గేమ్స్ మరియు ఇతర కార్యక్రమాల ఏర్పాటు చేయడమే కాకుండా వారికిష్టమైన ఎన్నో వంటకాలతో ప్రత్యేకమైన బఫెట్ కూడా ఉంటుంది. ఈ కార్నివాల్ సందర్భంగా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఉల్లాసంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేలా మొత్తం హోటల్ ప్రాంగణాన్ని అలంకరించడం జరుగుతుంది.  తద్వారా ప్రత్యేకమైన వాతావరణం ఉట్టిపడేలా చూడడం ఈ అలంకరణ ప్రత్యేకత.రిజర్వేషన్ల కోసం సంప్రదించండి :  +914066788888 / 9246887195.