ప్రైమ్ వీడియో అల్లు అర్జున్ నటించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ పుష్ప: ది రైజ్-పార్ట్ 1 స్ట్రీమింగ్ ప్రీమియర్‌ను ప్రకటించింది

Business Celebrity Life Cinema covid-19 news Entertainment Featured Posts National Technology Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా-5 జనవరి, 2022: ఇండియాలో అత్యంత ప్రియమైన ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్స్ లో ఒకటైన ప్రైమ్ వీడియో ఈ కొత్త సంవత్సరంలో తమ ప్రేక్షకుల కోసం ఒక ట్రీట్‌ని అందిస్తున్నది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మందాన‌, ఫ‌హాద్ ఫాజిల్ కాంబినేష‌న్ లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ పుష్ప ది రైజ్ పార్ట్ 1 చిత్రం జ‌న‌వ‌రి 7, 2022 నుంచి ప్రైమ్ వీడియోలో ఎక్స్ క్లూసివ్ గా స్ట్రీమింగ్ అవ్వ‌బోతున్నది. తెలుగుతో
పాటు మ‌ళయాలం, క‌న్న‌డ‌, త‌మిళం భాష‌ల్లో ఈ చిత్రం ప్రైమ్ మెంబ‌ర్స్ కు అందుబాటులోకి రానున్నది మనీష్ మెంఘాని, కంటెంట్ లైసెన్సింగ్ హెడ్, ప్రైమ్ వీడియో, ఇండియా మాట్లాడుతూ ఇలా అన్నారు, “ప్రైమ్ వీడియోలో యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ పుష్ప: ది రైజ్- పార్ట్ 1 చిత్రాన్ని ప్రపంచవ్యాప్త స్ట్రీమింగ్ ప్రీమియర్‌ ద్వారా మాప్రేక్షకులకు అందించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ నూత‌న సంవ‌త్స‌రం ఆరంభంలోనే మా ప్రైమ్ మెంబర్స్ కి పుష్ప ది రైజ్ పార్ట్ 1 తో స్పెష‌ల్ థ్రిల్ అందిస్తున్నాము, మా లోక‌ల్ లాంగ్వేజ్ కంటెంట్ లో ఉన్న అత్యద్భుత‌ క్యాట్, లాగ్ కు పుష్ప ది రైజ్ కొత్త హంగులు జోడించ‌నున్నది, ఈ ఫాస్ట్ ఫేస్ మూవీ మా మెంబ‌ర్స్ ను మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ఆక‌ట్టుకోనుంది. అల్లు అర్జున్, ర‌ష్మిక మందాన‌, ఫ‌హాద్ ఫాజిల్ తమ న‌ట‌న‌తో ప్రేక్షకుల్ని అల‌రించారు.

మైత్రి మూవీ మేక‌ర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా మా ప్రైమ్ మెంబ‌ర్స్ ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని ఆశిస్తున్నాను. ”ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్టాడుతూ, “నేను స్క్రిప్ట్ చదివిన వెంటనే, అది నాకు సరైనదని అనిపించింది. ఏమీ లేని వ్యక్తి జీవితంలో పైకి ఎదిగే క్రమంలో నడిచిన ఈ కథ రన్-ఆఫ్-ది-మిల్ అని అనిపించవచ్చు, కానీ సినిమాలో అతని ప్రయాణం తెర‌కెక్కించిన‌ విధానం, ఈ పాత్రకు జోడించిన అనేక లేయర్లు చాలా ప్రత్యేకమైనవి, నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను పోషించిన పాత్ర‌ల‌కి పుష్ప లోని రోల్ భిన్నంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో విడుదల చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువవుతుందన్న భావన నాకు థ్రిల్లింగ్ గా ఉంది. ” అని అన్నారు.

రచయిత ,దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, “ముందుగా ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్చే సిన ప్రేక్షకుల‌కి నా ధ‌న్యవాదాలు, మంచి-చెడుల‌కు కాస్త దూరంగా ఓ సెన్సిటివ్ టాపిక్ ని తీసుకొని, దాన్ని ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని అల‌రించే పద్ధతిని రెడీ చేసి, పుష్ప ది రైజ్ పార్ట్ 1 ను తెర‌కెక్కించాను. ఓ రోల‌ర్ కోస్ట‌ర్ రైడ్
మాదిరిగా ఈ సినిమా ప్రేక్షుకుల్ని అల‌రిస్తోంది. ప్రైమ్ వీడియోలో కూడా ఈ చిత్రాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ఆద‌రిస్తార‌ని నేను ఆశిస్తున్నాను. ” అని అన్నారు. ర‌ష్మిక మందాన మాట్లాడుతూ, “ప్రేక్షకులు ఈ సినిమాని ఇంత గొప్పగా మెచ్చుకోవడం చూస్తుంటే, నేను నెలల తరబడి ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ద‌క్కిన‌ట్లుగా అనిపిస్తుంది. “అల్లు అర్జున్,ఫహద్ ఫాసిల్ వంటి స్టార్ నటులతో
కలిసి పనిచేయడం నాకు కీ హైలైట్‌లలో ఒకటి. ప్రత్యేకమైన కథాంశం,శక్తివంతమైన కథనం, అలాగే బహుముఖ ప్రజ్ఞ చాటే పాత్రలు ఈ చిత్రానికి జీవం చేకూర్చి, అపారమైన విజయానికి ప్రాణం పోసాయి. ” అని అన్నారు.

ఫ‌హాద్ ఫాజిల్ మాట్లాడుతూ, “పుష్ప ది రైజ్ పార్ట్ 1 తో తెలుగు చిత్ర‌సీమ‌లో నా ఎంట్రీ చాలా అద్భుతంగా జ‌రిగింది. ద‌ర్శుకుడు సుకుమార్ నా పాత్ర‌ను తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా ఉంది. ఇలాంటి విలక్ష‌ణమైన పాత్ర పోషించ‌డం
నా అదృష్టం. ఈ కొత్త ఏడాదిలో ప్రైమ్ వీడియో మెంబ‌ర్స్ కు ఈ చిత్రాన్ని అందిచ‌డం నాకు చాలా సంతోషాన్ని
ఇస్తుంది. ” అని అన్నారు.