Purplle.com signs Bollywood star Sara Ali Khan as its first brand ambassador; launches the #GoPurplle Campaign

ప్రచారకర్తగా బాలీవుడ్ తార సారా అలీ ఖాన్ తో పర్పుల్.కామ్ ఒప్పందం

Business covid-19 news Entertainment Featured Posts National Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ముంబై, 30 జనవరి, 2021:  భారతదేశ అగ్రగామి సౌందర్య గమ్యస్థానమైన పర్పుల్.కామ్ బాలీవుడ్ రేపటితరం తార సారా అలీ ఖాన్ ను తన ప్రచారకర్తగా నియమించుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంది. ది గుమతి చేసుకున్న పదార్థాలతో తయారైన ఉత్పత్తులతో అందంలో రాజసానికి ప్రతీకగా పర్పుల్ నిలిచింది. అదే సమయంలో ప్రతీ మహిళలకూ అవి అందుబాటులో ఉంటాయి. అందాన్ని అందరికీ అందించే లక్ష్యంతో అందాన్ని చూసే విషయంలో మహిళకు సాధికారత కల్పించేందుకు పర్పుల్, సారా ఒక్కటయ్యారు.ఈ బ్రాండ్ నూతనంగా సారా అలీ ఖాన్ తో #గోపర్పుల్ క్యాంపెయిన్ ను ఆవిష్కరించింది. ఇద్దరికీ గల ఒకే ఒక భావన ‘అందరికీ అందం’ అనే లక్ష్యంతోనే ఇది రూపుదిద్దుకుంది. 6000 మేకప్ ఉత్పత్తులు మొదలుకొని ఎగ్జోటిక్ దినుసులతో రూపుదిద్దుకున్న 5000 నేచురల్ ఉత్పాదనల వరకు అన్ని కూడా రూ.400 లోపుగానే ఉంటాయి. నో – క్వశ్చన్స్ – ఆస్క్ డ్ రిటర్న్ పాలసీ ,పర్పుల్  పై ఒకరి మొదటి ఆర్డర్ ఉచిత డెలివరీ వివరాలను సారా ఈ సందర్భంగా పంచుకున్నారు. ప్రతీ నెలా 300 నూతన సౌందర్య ఉత్పాదనలను ఈ బ్రాండ్ ఎలా వెలువరిస్తున్నదీ కూడా ఆమె చెప్పారు.

Purplle.com signs Bollywood star Sara Ali Khan as its first brand ambassador; launches the #GoPurplle Campaign
Purplle.com signs Bollywood star Sara Ali Khan as its first brand ambassador; launches the #GoPurplle Campaign

బ్రాండ్ కు మొదటి ప్రచారకర్తగా  ఉండడంపై సారా అలీ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘అందరికీ పనికొచ్చే ,అందరికీ అందుబాటులో ఉండే సౌందర్యానికి ప్రతీకగా పర్పుల్ నిలిచింది. మహిళలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా ఇది చేస్తుంది. వారు సాధ్యమైనంత అందంగా ఉండేలా వారు కనిపించేలా, భావించేలా చేస్తుంది.  పర్పుల్ తో ప్రయాణం నాకెంతో ఆనందదాయకం. పర్పుల్ ప్రచారకర్తగా ఉండడం నాకెంతో గర్వకారణం’’ అని అన్నారు.పర్పుల్.కామ్ సహవ్యవస్థాపకులు, సీఈఓ మనీష్ తనేజా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘పర్పుల్ ప్రచారకర్తగా సారా ను కలిగిఉండడం మాకెంతో ఆనందదాయకం. శక్తివంతమైన నూతన తరం మహిళ ఆత్మవిశ్వాసానికి మరియు అంకితభావానికి ఆమె ప్రతీక. ఆమె తన భావాలను ధైర్యంగా వ్యక్తీకరిస్తుంటారు. తన చర్మం తీరుతెన్నుల పట్ల ఆమె ఎంతో సౌకర్యవంతంగా ఉన్నారు. యువతకు శక్తివంతమైన ఆదర్శ మహిళగా నిలిచారు. అందం ప్రతీ ఒక్క ఇంటిని చేరుకునే సౌలభ్యాన్ని అందిస్తూ, వినియోగదారులు తమ సొంత విశిష్ట ప్రయాణాన్ని ఆరంభించేలా ఆమె వారికి స్ఫూర్తిని అందించనున్నారు. మా వినియోగదారులతో అనుసంధానం కావడాన్ని ఈ అనుబంధం మరింత పటిష్ఠం చేస్తుంది. ఈ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’’ అని అన్నారు.ఈ 360 డిగ్రీ క్యాంపెయిన్ ను స్ప్రింగ్ మార్కెటింగ్ క్యాపిటల్ రూపొందించింది. పటిష్ఠమైన కమ్యూనికేషన్ ప్లాన్ తో పర్పుల్ తన ఆశయాన్ని సాధించే దిశలో భారతీయులను చేరుకోనుంది.