Sat. Jun 10th, 2023
Spread the News

365 తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి 19 హైదరాబాద్: కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్త దేశాలకు వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్‌-19 వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఓ అధికారిక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 9,020 మంది మరణించినట్లుగా సమాచారం. యూరప్‌లో 4,134 మంది, ఆసియాలో 3,416 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లోనే 712 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం 90,293 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యూరప్‌ కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర ప్రభావానికి గురైతుంది.